Harish Rao: నా ప్రశ్నకు సమాధానాలు ఇచ్చేలా ఆదేశించండి.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ

అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని స్పీకర్ కు హరీశ్ రావు లేఖ రాశారు.

Update: 2025-03-04 09:14 GMT
Harish Rao: నా ప్రశ్నకు సమాధానాలు ఇచ్చేలా ఆదేశించండి.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తాను అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad Kumar) కు లేఖ రాశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Session) తాను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదన్నారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు (అన్ స్టార్డ్ క్వశ్చన్స్) సమాధానాలు రాకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(1) ప్రకారం శాసనసభ్యులు అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలను సభా టేబుల్ పై అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని లేఖలో గుర్తు చేశారు. రాష్ట్ర, నియోజకవర్గం ప్రయోజనాల కోసం అసెంబ్లీలో ప్రశ్నలు అడగటం, సకాలంలో వాటికి సమాధానాలు పొందడం శాసనసభ సభ్యుల హక్కు అన్నారు. అందువల్ల తాను అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చేలా సంబంధింత అధికారులను ఆదేశించాలని లేఖలో స్పీకర్ ను కోరారు.

Tags:    

Similar News