RTC యూనియన్ నేతలకు గవర్నర్ పిలుపు

టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై గవర్నర్ స్పందించారు.

Update: 2023-08-05 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై గవర్నర్ స్పందించారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్‌కు రావాలని ఆహ్వానించారు. బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకుందామని తమిళి సై పిలునిచ్చారు. కాగా, బిల్లుపై గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల శనివారం నిరసనకు దిగారు. దీంతో ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్, ఫలక్‌నుమా, ఫరూక్ నగర్, తదితర డిపోల్లో కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ తమ సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజ్‌భవన్ వద్ద కూడా ఉదయం 11.00 గంటలకు మరోసారి నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. గ్రేటర్‌లోని కార్మికులు 10 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గవర్నర్ స్పందించడం చర్చనీయాంశమైంది.

Read More:   ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్

RTC విలీనం బిల్లుపై గవర్నర్‌కు ప్రభుత్వం వివరణ  

Tags:    

Similar News