ఇంటర్ విద్యార్థుల వరుస సూసైడ్స్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం!
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గత కొద్దిరోజులుగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆలస్యంగానైనా సర్కార్ అలర్టయింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గత కొద్దిరోజులుగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆలస్యంగానైనా సర్కార్ అలర్టయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 14 బడా కాలేజీల యాజమాన్యాలకు మీటింగ్‌కు హాజరుకావాలని పిలుపందింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో సోమవారం సాయంత్రం 4 గంటలకు పలు యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి భేటీ కానున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న తీరుపై, ఎందుకు ఇలా జరుగుతుందనే అంశాలపై ఆరా తీయనున్నారు. మరోసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
సమావేశానికి హాజరుకావాల్సిన యాజమాన్యాలివే..
1. ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీ
2. దీక్ష జూనియర్ కాలేజీ
3. ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ
4. ఎఫ్ఐటీ జేఈఈ జూనియర్ కాలేజీ
5. గౌతమి జూనియర్ కాలేజీ
6. నారాయణ జూనియర్ కాలేజీ
7. ప్రగతి జూనియర్ కాలేజీ
8. రిసోనెన్స్ జూనియర్ కాలేజీ
9. ఎస్సార్ జూనియర్ కాలేజీ
10. షాహీన్ జూనియర్ కాలేజీ
11. శ్రీ ఆదర్శ జూనియర్ కాలేజీ
12. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ
13. శ్రీమేధ జూనియర్ కాలేజీ
14. తపస్య జూనియర్ కాలేజీ