సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న టమాట ధరలు!

గత కొద్ది కాలంగా టమాట ధరలు భారీగా పెరిగి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు ఒకప్పుడు టమాటాలను అన్ని కూరల్లో వినియోగించేవారు.

Update: 2023-08-07 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది కాలంగా టమాట ధరలు భారీగా పెరిగి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు ఒకప్పుడు టమాటాలను అన్ని కూరల్లో వినియోగించేవారు. కానీ, టామట ధరలు పెరిగినప్పటి నుంచి టమాటాలు కొనుగోలు చేయాలంటేనే వణికిపోతున్నారు. నాలుగైదు రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు రూ. 200 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 120 నుంచి 160 వరకు వ్యాపార వేత్తలు అమ్ముతున్నారు. తాజాగా, టమాట ధరలు తగ్గినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్‌లో కేజీ టమాటాలను కేవలం రూ. 60 అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి వర్షాలు కురవకపోవడంతో కోతలు ఊపందుకున్నాయి. వ్యాపారవేత్తలు పంటను వీలైనంత తక్కువ సమయంలో అమ్ముకునేందుకు పోటీపడుతున్న క్రమంలో ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News