నగరం నడిబొడ్డున ఇంత దారుణం ఏంటి..? కేసీఆర్‌పై ఆకునూరి మురళి ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మరిచి ఎప్పుడు రాజకీయాలే చేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు.

Update: 2023-08-18 11:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మరిచి ఎప్పుడు రాజకీయాలే చేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. గిరిజన మహిళపై ఎల్బీనగర్ పోలీసుల దాష్టీకం ఘటనపై స్పందించిన ఆయన రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని.. 2023లోనూ ఇంతటి దారుణం ఏంటని ప్రశ్నించారు. విచారణ పేరుతో ఎస్టీ మహిళను స్టేషన్‌కు తీసుకుపోయిన ఎల్బీ నగర్ పోలీసులు ఆమెను తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనను తీవ్రంగా స్పందించిన సీపీ బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు.

దీనిపై శుక్రవారం స్పందించిన ఆకునూరి మురళి.. నగరం నడిబొడ్డున ఇంత దారుణం ఏంటని నిలదీశారు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కాదని వారిని అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి తక్షణమే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలన్నారు. గతంలో మరియమ్మ కేసులో కూడా బాధ్యులను అరెస్ట్ చేసి శిక్ష విధించలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఎప్పుడు రాజకీయాలేనా? కొంచెం పరిపాలన కూడా చెయ్యండి అని ప్రశ్నించారు. బాధిత మహిళకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News