కాసానితో మాజీ మంత్రి కీలక భేటీ.. తాజా రాజకీయాలపై చర్చ
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఏపీ మాజీ మంత్రి ఏ.మారెప్ప భేటీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఏపీ మాజీ మంత్రి ఏ.మారెప్ప భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఖమ్మం సభ టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మారెప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు, అగ్రకులాల పేదలకు టీడీపీ పాలనలోనే న్యాయం జరిగిందన్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయన్నారు. ఈ పాలనలో ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇతర పార్టీల్లోకి వెళ్లిన టీడీపీ నాయకులంతా ఆత్మగౌరవం నిలుపుకునేలా త్వరలోనే తిరిగి మాతృ పార్టీకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు టి.జ్యోత్స్న, రాష్ట్ర నాయకుడు కాసాని వీరేష్ ఉన్నారు.