BREAKING: టీ-బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో

Update: 2024-07-01 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో అమరణ నిరహార దీక్ష చేస్తోన్న మోతిలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు బీజేవైఎం నాయకులు బీజేపీ స్టేట్ ఆఫీస్ నుండి బయలుదేరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. దీంతో బీజేవైఎం నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీక్ష చేస్తోన్న మోతిలాల్‌ను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేవైఎం నేతలు పోలీసులను ప్రశ్నించారు.

ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరుతామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేవైఎం నేతలు మధ్య వాగ్వదం జరిగింది. దీంతో పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, గాంధీ ఆసుపత్రి ఇవాళ ఉదయం నుండి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మోతిలాల్‌కు మద్దతుగా నిరుద్యోగులు గాంధీ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు మోతిలాల్‌ను పరామర్శించేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ వద్ద హై టెన్షన్ నెలకొంది. 


Similar News