అలర్ట్: ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు
ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది న్యాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ 6-బీను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ నంబర్లు సేకరించడం మొదలుపెట్టింది. డిసెంబర్ 12వ తేదీ వరకు 54.32 కోట్ల ఆధార్ నంబర్లను సేకరించినట్లు సమాచారం. కానీ, వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.