CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్రకు సర్వం సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిష్టాత్మక చేపట్టిన మూసీ పునరుజ్జీవన(Revival of Moose River) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న మూసీ పాదయాత్ర కు అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Update: 2024-11-07 15:21 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిష్టాత్మక చేపట్టిన మూసీ పునరుజ్జీవన(Revival of Moose River) కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించనున్న మూసీ పాదయాత్ర కు అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. 10 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11.30 కు యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. 1.30 కి రోడ్డు మార్గంలో సంగెం వెలుతారు.

సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభిస్తారు. ఇక్కడ మూసీ నది భీమలింగం ఆనకట్ట వద్ధ నదిలో ఉన్న భీమలింగేశ్వరుడికి రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు. ఇక్కద రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. సంగెం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభించి మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం నుంచి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు. అక్కడే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమవుతారు. 

Tags:    

Similar News