ఆనాడు మొక్కి, ఇప్పుడు చెల్లించుకున్నా.. కొమురవెల్లి మల్లన్న సేవలో ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న సేవలో పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) శనివారం సిద్దిపేట జిల్లా (Siddipet District)లోని కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallana) సేవలో పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేగాక పక్కనే ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవతకు బోనం ఎత్తి, మొక్కులు చెల్లించుకున్నారు. తన కోరిక నెరవేరిన సందర్భంగా మల్లన్న దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా గుడిలో పూజలు చేస్తున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
దీనిపై ఎమ్మెల్సీ కవిత.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను (BC Reservations) సాధించడం కోసం తెలంగాణ జాగృతి (Telangana Jagruthi), యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (United Pule Front) ఆధ్వర్యంలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం (First Round Table Meeting) నిర్వహించిన నాడే చట్ట సభల్లో బీసీ బిల్లు ఆమోదం పొందాలని కొమురవెల్లి మల్లన్న స్వామికి మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈరోజు మల్లన్న స్వామికి మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కులగణన నిర్వహించి, బీసీ జనాభా 42 శాతం మంది ఉన్నారని తెల్చి చెప్పింది. బీసీలకు జనాభా దమాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు దక్కాలనే ఉద్దేశంతో మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ బిల్లును ఆమోదింపజేసింది.