ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా పేద విద్యార్థులకు చదువు : టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందం ఏ వృత్తిలోనూ ఉండదని, దేశం, రాష్ట్రం, కుటుంబంలో మార్పు రావాలంటే అది ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమవుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-09-05 16:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆనందం ఏ వృత్తిలోనూ ఉండదని, దేశం, రాష్ట్రం, కుటుంబంలో మార్పు రావాలంటే అది ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమవుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. కష్టం ప్రైవేటు టీచర్స్‌ది లాభాలు మాత్రం ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలది అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం చట్టం తీసుకురావాల్సిన అవసరమున్నదన్నారు. ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షమే టీడీపీ అన్నారు. కష్టానికి తగిన ఫలితం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్‌టీఆర్‌ మోడల్‌ స్కూల్స్‌ను నారా భువనేశ్వరి నడిపిస్తున్నారని, ఈ స్కూల్‌లో కుటుంబానికి అండగా ఉండే తల్లిదండ్రులను కోల్పోయిన పేద విద్యార్థులను చదివిస్తున్నారన్నారు. ముంజా వెంకట్రాజంగౌడ్‌ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ బాబు, తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ కార్తిక్‌, నాగేంద్ర చౌదరి, లక్ష్మీప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సరస్వతి, మొయిన్‌, సుధాకర్‌, విక్రమ్‌, వర్షిణి, పరమేశ్వరి, సంధ్యపోగు రాజశేఖర్, టీడీపీ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News