Droupadi Murmu: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

భారత రాష్ట్రపతి(Indian President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నేడు హైదరాబాద్(Hyderabad) రానున్నారు.

Update: 2024-09-28 00:40 GMT

దిశ, వెబ్‌డెస్క్:భారత రాష్ట్రపతి(Indian President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నేడు హైదరాబాద్(Hyderabad) రానున్నారు.మేడ్చల్‌(Medchal) జిల్లా శామీర్‌పేట(Shamirpet) పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ (NALSAR Law University) 21వ స్నాతకోత్సవ కార్యక్రమాని(Convocation ceremony)కి ఆమె ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలీ, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ విష‌యాన్ని వాహ‌న‌దారులు గ‌మ‌నించి ప్ర‌త్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నిన్న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన 8 రాష్ట్రాలకు సంబంధించిన స్టాళ్లను, 4 ఫుడ్ కోర్టులను, మీడియా సెంటర్‌ను, ఇతర స్టాల్స్‌ను పరిశీలించారు.


Similar News