KTR : రైతులు చనిపోతున్నా పట్టించుకోరా..? మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-09-12 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ కాలేదని కొందరు.. పెట్టుబడి సాయం లేక మరి కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ధైర్యంగా ఉండండి అని గురువారం ఎక్స్ వేదికగా కోరారు.

కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా బోగస్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ అని సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్లు చల్లారుతాయి? రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రం లో ఏం జరుగుతుందో చూడు.. అని సూచించారు.


Similar News