పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీల ధర్నా

ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ధర్నా చేపట్టాయి.

Update: 2023-02-09 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో బీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు. సేవ్ ఎల్ఐసీ ప్లకార్డులతో ఎంపీలు ధర్నాకు దిగారు. కాగా ఇదే అంశంపై శాస్త్రి భవన్ వద్ద యూత్ కాంగ్రెస్ దర్నా చేపట్టింది. హిండెన్ బర్గ్ నివేదికపై సభలో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ, సీజేఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ వరుసగా ఆందోళనకు దిగుతోంది. ఇదే అంశమై ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మాణాలను సభాపతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వరుసగా పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నాయి.

Tags:    

Similar News