స్టాఫ్ నర్సు సీనియారిటీ లిస్టులో తప్పిదాలు.. అధికారుల తీరుపై డీహెచ్ సీరియస్
జనరల్ ట్రాన్స్‌ఫర్స్ సందర్భంగా తయారు చేసిన స్టాఫ్‌నర్సు సీనియారిటీ లిస్టులో తప్పిదాలు జరిగాయని స్వయంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
దిశ, తెలంగాణ బ్యూరో: జనరల్ ట్రాన్స్‌ఫర్స్ సందర్భంగా తయారు చేసిన స్టాఫ్‌నర్సు సీనియారిటీ లిస్టులో తప్పిదాలు జరిగాయని స్వయంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ అంగీకరించారు. కొందరు నర్సింగ్ ఆఫీసర్ బేరర్స్ డిపార్ట్ మెంట్‌లోని వ్యక్తులతో కుమ్మక్కై, ఒరిజినల్ లిస్టు కాకుండా నామినల్ జాబితాను డీహెచ్ కార్యాలయానికి పంపించారని ఆయన మంగళవారం ఓ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు కారణమైనోళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డీఎంఈ పరిధిలోని 23 ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీల్లో పని చేసే నర్సింగ్ ఆఫీసర్ డివిజన్‌లోని ఉద్యోగులకు అందజేశామన్నారు. ఈ తప్పిదాలపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. అయితే గాంధీ, ఉస్మానియా, ఈఎన్టీ, ఫీవర్, ఎంఎన్ జే క్యాన్సర్, తదితర ఆసుపత్రుల్లో పనిచేసే స్టాఫ్‌లోని కొందరికి నోటీసులు పంపించామని డీహెచ్ పేర్కొన్నారు.