DGP Jitender: పౌరుల భద్రత కంటే.. ప్రమోషన్ ముఖ్యం కాదు: డీజీపీ జితేందర్ సెన్సేషనల్ కామెంట్స్
పుష్ప-2 (Pushpa-2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట (Stamped) జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 (Pushpa-2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద తొక్కిసలాట (Stamped) జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) ఐసీయూ (ICU) విభాగంలో వైద్యుల పర్యవేక్షణ మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్‌పై డీజీపీ జితేందర్ (DGP Jitender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stamped) ఘటన దురదృష్టకరమని అన్నారు.
అల్లు అర్జున్ హీరో అయి ఉండొచ్చు కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని తెలిపారు. పౌరుల భద్రత కంటే మూవీ ప్రమోషన్ (Movie Promotion) ముఖ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పౌరులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. తొక్కిసలాట (Stamped) కేసు విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun)పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్‌బాబు (Mohan Babu)పై కూడా త్వరలోనే చర్యలుంటాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.