Deputy CM Bhatti: భూమి లేని నిరుపేద రైతులకు భారీ గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేద రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది.

Update: 2024-12-16 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేద రైతులకు ప్రభుత్వం (Congress Government) శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 28న భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి ఏటా రూ.12 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) తెలిపారు. పథకానికి అర్హులైన రైతులకు రెండు దఫాలుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి విడతలో భాగంగా డిసెంబర్ 28న రూ.6 వేలు అకౌంట్లలో జమ కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి చూపించామని అన్నారు. సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా (Raithu Bharosa) పథకాన్ని ఈ సంకాంత్రి (Sankranthi)కి ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం వ్యవసాయ రంగానికి రూ.50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Tags:    

Similar News