47గంటల పాటు కూల్చివేతలు

మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. 47 గంటల పాటు కూల్చివేతలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.

Update: 2024-10-01 06:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. 47 గంటల పాటు కూల్చివేతలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. చాదర్ ఘాట్ మూసాపూర్.. శంకర్ నగర్ బస్తీ లో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఆర్ బీ ఎక్స్ అని రాసిన.. స్వచ్ఛందంగా ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. పునరావాసంలో భాగంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను రెవెన్యూ అధికారులు అందజేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి షిఫ్ట్ అయిన వారి నిర్మాణాలను ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్నారు. 

మరోవైపు అంబర్ పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసీ రామ్ నగర్ లో మూసీ పరీవాహక ప్రాంత వాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తులసీ రామ్ నగర్ లో ఎవరి ఇంటికి బుల్డోజర్ వచ్చిన అందరూ అడ్డుపడాలన్నారు. ఏం ఇచ్చినా మీరు ఇక్కడి నుంచి కదలొద్దన్నారు. ఒకరి ఇల్లు కూలుతుంటే మిగతా వాళ్లు ఇంట్లో ఉండకూదన్నారు. అందరికీ అండగా ఉంటామన్నారు. మీకు అండగా ఉండాలని, మిమ్మల్ని పరామర్శించమని కేసీఆర్ చెప్పడంతో తాము మీకు మద్దతుగా వచ్చామన్నారు.


Similar News