IAS Dana Kishore: గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
పాలనా పరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: పాలనా పరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Verma)కు ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ దాన కిషోర్ (IAS Dana Kishore)ను నియమిస్తూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi Kumari) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Moosi Riverfront Development Corporation Limited) ఎండీగా దాన కిషోర్ (Dana Kishore) వ్యవహరిస్తున్నారు. తాజాగా, సర్కార్ ఆయనను గవర్నర్ జష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.