కాంగ్రెస్‌కు డీ. శ్రీనివాస్ విశిష్ట సేవలు.. : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున 3 గంటలకు గుండెపోటు రాగా కన్నుమూశారు.

Update: 2024-06-29 02:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున 3 గంటలకు గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. కాగా, డీఎస్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌కు డీఎస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు. డీఎస్ కుటుంబసభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరో వైపు డీఎస్ మరణవార్త తెలుసుకుని ఆయన అభిమానులు, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డీఎస్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు.

Similar News