బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాల్సిందే.. రాష్ట్ర వామపక్ష పార్టీల డిమాండ్

బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి అప్పగించాలని రాష్ట్ర వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

Update: 2024-07-01 13:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి అప్పగించాలని రాష్ట్ర వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం ఇవాళ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు రమ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం డిమాండ్‌ చేసింది. ఇందుకోసం జూలై 5న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు,హైదరాబాదు (రెడ్‌హిల్స్‌)లోని సింగరేణి భవన్‌ వద్ద ధర్నాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ నిరసనలు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, డీజీ నరసింహారావు, సీపీఐ నేత ఇ.టి. నరసింహా, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నేత రమ, రామచందర్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత గోవర్దన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత ఎం శ్రీనివాస్‌, ఆకుల పాపయ్య, ఎంసీపీఐ నేత వనం సుధాకర్‌, ఎస్‌యూసీఐ(యూ) నేత రవితేజ, ఆర్‌ఎస్‌పీ నేత జానకి రాములు పాల్గొన్నారు.

Tags:    

Similar News