మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం మోడీదే: కేంద్ర మంత్రి బండి
దేశంలో మాట ఇస్తే దానిని నెరవేర్చే ప్రభుత్వం ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: దేశంలో మాట ఇస్తే దానిని నెరవేర్చే ప్రభుత్వం ప్రధాని మోడీ(Prime Minister Modi)దే అని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో నిరుద్యోగ సమస్య(Unemployment problem) పెరిగిపోతుందని బండి సంజయ్ అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం(BJP Govt)లో ఇప్పటివరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా.. 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నామని బండి అన్నారు. అలాగే మోదీ పాలనలో ఆర్థిక ప్రగతిలో నెం.5 కు చేరుకుందని.. 2047 నాటికి భారత్ నెం.1 కావడం తథ్యం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.