రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే.. MLA సంజయ్‌పై KTR షాకింగ్ కామెంట్స్

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్

Update: 2024-07-01 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. సంజయ్ బీఆర్ఎస్ నుండి వెళ్లిపోవడంతో జగిత్యాలకు పట్టిన శని వదిలిపోయిందన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. సంజయ్‌ ఎంగిలి మెతుకులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి పోయారని మండిపడ్డారు. వ్యక్తిగత పనుల కోసమే ఆయన పార్టీ మారారని విమర్శించారు.

రాజకీయాల్లో హత్యాలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయి రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను, సోదరి కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్‌ను జగిత్యాల నుండి తరిమికొడుదామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీని వీడి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

Similar News