Cyberabad: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు.. పోలీస్ శాఖ కొత్త ఆంక్షలు

తెలంగాణ(Telangana)లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Telangana Public Service Commission) ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీలలో గ్రూప్-2 పరీక్షలు(Group-2 exams) జరగనున్నాయన్న విషయం తెలిసిందే.

Update: 2024-12-12 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(Telangana Public Service Commission) ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీలలో గ్రూప్-2 పరీక్షలు(Group-2 exams) జరగనున్నాయన్న విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ(TGPSC) ఇప్పటికే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను(Hall Tickets) కూడా విడుదల చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగుకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష నిర్వహించే తేదీలలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు(Restrictions) కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఆంక్షలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి(Cyberabad Commissioner Avinash Mohanthi) కీలక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలలో పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ విధించడంతో పాటు ముఖ్యంగా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 5 నుంచి అంతకన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదని అన్నారు. అలాగే పరీక్ష జరిగే సమయాలలో పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉండే జీరాక్స్, ఇంటర్నెట్ సెంటర్స్ తప్పకుండా మూసివేయాలని తెలిపారు. ఈ నిబంధనలు పరీక్ష కేంద్రాల వద్ద విధులు నిర్వహించే వారికి వర్తించవు అని నోటీసులలో పేర్కొన్నారు. ఇక ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్-163(BNSS Section-163) ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా వాయిదా పడ్డ గ్రూప్-2 పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ నెల 15, 16 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించి, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. 

Tags:    

Similar News