Delhi: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సీఎం భేటీ
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర బొగ్గు,గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్లిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరసగా కేంద్ర మంత్రులతో(Union Ministers) సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ(Telangana) రాష్ట్రానికి సంబంధించి కేంద్రమంత్రులకు పలు ప్రతిపాధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Union Minister G.Kishan Reddy)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కిషన్ రెడ్డితో తొలిసారి అధికారికంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సీఎంకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురి మధ్య రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం, కేంద్రమంత్రికి కీలక ప్రతిపాధనలు చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వీరిద్దరు తొలిసారి సమావేశం అవుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి 7గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Prathan)తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ(Nithin Gadkari)ని కలవనున్నారు.