AICC: హత్రాస్ ఘటనపై న్యాయం జరిగే వరకు పోరాటం.. రాహుల్ గాంధీ

హత్రాస్ ఘటనపై(Hathras Incident) న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) స్పష్టం చేశారు.

Update: 2024-12-12 14:10 GMT

దిశ, వెబ్ డెస్క్: హత్రాస్ ఘటనపై(Hathras Incident) న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) స్పష్టం చేశారు. హత్రాస్ బాధిత కుటుంబాలను కలిసేందుకు వారి నివాసానికి రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా వారితో చర్చించిన అంశాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్.. ఈ రోజు హత్రాస్‌కి వెళ్లి 4 సంవత్సరాల క్రితం జరిగిన అవమానకరమై, దురదృష్టకర సంఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాన్ని కలిశానని, వారు చెప్పిన విషయాలు నన్ను కదిలించాయని అన్నారు.

కుటుంబం మొత్తం ఇప్పటికీ భయంతో జీవిస్తోందని, వారిని నేరస్తులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లలేకపోతున్నారని, ఎల్లప్పుడూ తుపాకులు, కెమెరాల నిఘాలో ఉంచబడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం(BJP Government) వారికి ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదని, వేరే చోటికి మారుస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా ప్రభుత్వం వారిపై పలు దౌర్జన్యాలకు పాల్పడుతోందని, మరోవైపు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ కుటుంబం యొక్క నిరాశ, నిస్పృహ దళితులపై బీజేపీ చేస్తున్న అఘాయిత్యాలకు నిదర్శనమని అన్నారు. ఇక ఈ కుటుంబాన్ని ఈ స్థితిలో ఉండనివ్వమని, వారికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతామని కాంగ్రెస్ నేత అన్నారు.

Tags:    

Similar News