Chamala: చిత్త శుద్ధి ఉంటే అసెంబ్లీ కి రావాలి.. కేసీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ సవాల్
చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజల ఇచ్చిన తీర్పును కేసీఆర్ అగౌరవ పరుస్తున్నాడని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని క్లియర్ కట్ గా ప్రజలు నిర్ణయిస్తే, కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడన్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే కేసీఆర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తాడని ప్రశ్నించారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిప్యూటీ సీఎంతో చర్చించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొచ్చిందన్నారు. ఇక అప్పుల రాష్ట్రానికి అధికారంలోకి వచ్చి మెస్ చార్జీలు, రైతు రుణమాఫీ, కరెంటు, సిలిండర్, తదితర వాగ్దానాలను సమర్ధవంతంగా నెరవేర్చుతున్నామన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకొని రాహుల్ గాంధీతో లేఖ రాయించాడని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను చూసి, బీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పుల కోసమే ప్రతి నెలా ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వచ్చేలా పని చేస్తున్నామన్నారు.