MLA Kunamneni: అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టొద్దు.. అసెంబ్లీలో CPI ఎమ్మెల్యే సెటైర్లు

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని.. అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వైఖరి ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సెటైర్లు వేశారు.

Update: 2024-07-27 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని.. అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వైఖరి ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సెటైర్లు వేశారు. శనివారం అసెంబ్లీలో కూనంనేని మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని.. ఆరు నెలలకే అన్నీ చేయలేదు అనడం సరికాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా జాగ్రత్త పడాలని, అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్టనట్లు తెలిపారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. ఆ అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. ఇదే సమయంలో అప్పుడు ఉన్నాయి కాబట్టి హామీలు నెరవేర్చలేం అనడం కూడా సరికాదని ప్రభుత్వ పెద్దలకు హితవు పలికారు.

Tags:    

Similar News