నేటి భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణం: భూగర్భ శాస్త్రవేత్త

బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలోని ములుగు(mulugu) జిల్లా కేంద్రంగా భూకంపం(earthquake:) వచ్చింది.

Update: 2024-12-04 08:57 GMT

దిశ, వెబ్ డెస్క్: బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలోని ములుగు(mulugu) జిల్లా కేంద్రంగా భూకంపం(earthquake:) వచ్చింది. దీని కారణంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రకంపణలు వచ్చాయి. కాగా ఈ భూకంపం పై స్పందించిన భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. ప్రపంచంలో సంబంవించే భూకంపాలకు అనేక కారణాలుంటయని చెప్పుకొచ్చారు. అలాగే నేడు తెలంగాణలో వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన వివరణ ఇస్తూ.. కాళేశ్వరం పరిసర ప్రాంతం మొత్తం ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలోనే కేంద్రం మ్యాప్‌ డిజైన్‌ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి డిజాస్టర్‌కు అనుకూలంగా ఉండే ఏరియాల్లో నిర్మాణాలు చేయకూడదని వాటర్‌ స్టోర్‌ చేయడంతో.. ఆ ఒత్తిడి వల్ల కూడా ఈ భూకంపం వచ్చి ఉండవచ్చని.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన జియో టెక్నికల్‌ రిపోర్ట్‌ కూడా లేదని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు చెప్పుకొచ్చారు.


Similar News