Congress MP: కొత్త ఏడాదిలోనైనా కేటీఆర్ రియలైజ్ అవ్వాలి

కొత్త ఏడాదిలోనైనా మాజీ మంత్రి కేటీఆర్‌కు బుద్ధి రావాలని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-12-31 17:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ఏడాదిలోనైనా మాజీ మంత్రి కేటీఆర్‌కు బుద్ధి రావాలని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోసాలపై కేటీఆర్ పశ్చాతాపం పడాలన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ నిజాలు ఒప్పుకోవాలన్నారు. పదేళ్ల పాటు రైతులు, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. త్రీడీ అనే పేరుతో కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై వ్యంగ్యంగా ట్వీట్ చేయడం సరికాదన్నారు. పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో? కేటీఆర్ స్పష్టం చెప్పాలన్నారు. కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుందని, ఈ సంవత్సరంలో ప్రజలకు ఎక్కడా మోసం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు పోరాడారని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉద్యమంలోనూ ఇదే ట్యాగ్ లైన్ తో ఉస్మానియా విద్యార్ధులు బలిదానాలకు గురయ్యారన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. గ్రూప్1, గ్రూప్2 పరీక్షలు కూడా నిర్వహించకుండా విద్యార్ధులను సతాయించిన ప్రభుత్వం బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి, చీకటి జీవోలతో కేసీఆర్ ప్రభుత్వం కాలం ఎల్లదీసిందన్నారు. ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేసిన వ్యవస్థ కేసీఆర్ కుటుంబానిది అంటూ ఫైర్ అయ్యారు. 2025 లోనైనా కేటీఆర్ కు జ్ఞానోదయం కలగాలని భగవంతుని కోరుతున్నానని ఎంపీ చురకలు అంటించారు. ఇక 2024 ఏడాది తన జీవితంలో గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో ఎంపీ అయ్యానని వివరించారు.

Tags:    

Similar News