ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కుదరదు.. కుండబద్దలు కొట్టిన CM రేవంత్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Outsourcing Employees)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(Outsourcing Employees)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయం(Secretariat)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే.. న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగుల సహకారం కావాలని అన్నారు.
వీలైనంత త్వరగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పుగా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలకమైన సూచనలు చేశారు.