Supreme: సీబీఐ విచారణ అంశంలో రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్
సీబీఐ విచారణ విషయంలో రాష్ట్రాలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: సీబీఐ విచారణ(CBI Enquiry) విషయంలో రాష్ట్రాలకు(States) సుప్రీం కోర్టు(Supreme Court) షాక్(Shock) ఇచ్చింది. సీబీఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి(Permission) అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఆ జాబితాలో ఉన్న ఆయా రాష్ట్రాలకు షాక్ తగిలినట్టు అయ్యింది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. ఈ నిబంధన తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ, మిజోరం, బెంగాల్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలలో అమలులో ఉంది. అయితే ఏపీలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు చేయడాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఇక నుంచి కేంద్ర ఉద్యోగులపై సీబీఐ విచారణ కోసం రాష్ట్రాల సమ్మతి అక్కరలేదని పేర్కొంది.