TJS: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి.. ప్రొ.కోదండరాంకు టీజేఎస్ నేతల వినతి

కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు హామీల(Six Guarantees) పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని టీజేఎస్ నేతలు(TJS Leaders) ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం(MLC Pro.Kodandaram) ను కోరారు.

Update: 2025-01-05 14:28 GMT

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) ఇచ్చిన ఆరు హామీల(Six Guarantees) పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని టీజేఎస్ నేతలు(TJS Leaders) ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం(MLC Pro.Kodandaram) ను కోరారు. ఆదివారం నాగార్జునసాగర్ లో జరిగిన గిరిజనుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న కోదండరాంతో నల్గొండ టీజేఎస్ జిల్లా కమిటీ(Nalgonda TJS Committee) సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు వై పాపిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు వచ్చే స్థానిక ఎన్నికలలో తెలంగాణ జన సమితి(Telangana jana Samithi) కూడా పాల్గొనాలని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అంతేగాక ఉద్యోగులకు సంబంధించిన డీఏలు మంజూరు కి కృషి చేయాలని, స్పెషల్ టీచర్ల ఇంక్రిమెంట్ కి సంబంధించి మరొకసారి ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయాలని విన్నవించారు. అలాగే సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల దీక్షలను విరమింపచేయుటకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ కోదండారాం.. సోమవారం రోజున ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని వారితో చెప్పారు.

Tags:    

Similar News