సీఎం పేరు మర్చిపోవడంలో కుట్ర కోణం ఉంది: కాంగ్రెస్ ఎంపీ చామల
హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన యాంకర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో(World Telugu Conferences) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేరు మర్చిపోయిన యాంకర్(Anchor) పై కాంగ్రెస్ ఎంపీ(Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేసే వారికి తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలియరా.. యాంకరింగ్ చేసే వ్యక్తికి తెలుగు రాదా అంటూ ప్రశ్నించారు. అలాగే తాను ఎంపీగా ఉన్నప్పటికి ఎదైన విషయం మాట్లాడాల్సి వస్తే.. పేపర్ రాసుకుంటానని.. పెద్ద కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తూ.. సీఎం పేరును ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. అలాగే తెలుగు మహా సభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడంపై ఏదో కుట్ర కోణం(Conspiracy angle) ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.