క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం : మెదక్ ఎంపీ
రామాయణ పేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూ నిర్వాసితుల వాస్తవాలను వివరించాలని, క్షేత్రస్థాయి సర్వే ద్వారా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధికారులకు సూచించారు.
దిశ, మెదక్ ప్రతినిధి : రామాయణ పేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూ నిర్వాసితుల వాస్తవాలను వివరించాలని, క్షేత్రస్థాయి సర్వే ద్వారా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అధికారులకు సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్ హెచ్ -76 డిజి మెదక్ టు సిద్దిపేట 69 కిలోమీటర్లు బైపాస్ రోడ్డు రామాయంపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల తో మెదక్ ఎంపీ మాధవ నేని రఘునందన్ రావు, నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, నేషనల్ హైవే ఈ ఈ బలరామకృష్ణ రామాయంపేట భూ నిర్వాసితులతో ఎంపీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితుల మనోభావాలను విడతల వారీగా స్వయంగా వారి మాటల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ… ఎన్ హెచ్ 76 మెదక్ నుంచి సిద్దిపేట 69 కిలోమీటర్లు బైపాస్ నిర్మాణంలో ఉండగా భూ సర్వే కి సంబంధించి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 2.65 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణంలో నిర్వాసితులు రోడ్డు విస్తరణలో భూ సర్వే కు సహకరించాలన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూ నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు ఆర్డీవో- తహసీల్దార్ స్థాయిలో క్షేత్రస్థాయి సర్వే ద్వారా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
బైపాస్ రోడ్డు విషయంలో నిర్వాసితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ నితిన్ గడ్కారీ మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నిర్వాసితులకు పరిహారం విషయంలో భూ సర్వేలో నిబంధన మేరకు రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ… రామాయంపేట బైపాస్ రోడ్డు విషయంలో నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటామని మీకున్న కష్టాలను తీర్చే విధంగా నియోజకవర్గ అభివృద్ధిలో మీ వెంట ఉండే పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, నేషనల్ హైవే ఈ ఈ బలరామకృష్ణ, డి ఈ అన్నయ్య, ఏఈ మురళీకృష్ణ రామాయంపేట తహసీల్దార్ రజని, సంబంధిత భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.