తిండి లేక వాళ్లు అల్లాడుతున్నారు: Mallu Ravi
ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్ర ప్రజల జీవనం అతలాకుతలం అయిందని, అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేనట్లే వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్ర ప్రజల జీవనం అతలాకుతలం అయిందని, అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేనట్లే వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. వరద ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. వరదల వల్ల కాలనీలన్నీ చెరువులుగా మారాయని తెలిపారు. సర్వం కోల్పోయి కొందరు తిండికి లేక అల్లాడుతున్నారని అన్నారు. కేవలం సెక్రటేరియట్, ప్రగతి భవన్‌లు బావుంటే బంగారు తెలంగాణ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పొంగులేటి వరద బాధితులకు ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారని, అలాగే కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని వివరించారు.