Telangana Assembly Sessions : బీఆర్ఎస్ వల్ల ఒక జనరేషన్ నాశనం అయింది : భట్టి విక్రమార్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బడ్జెట్(Budget) పై చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బడ్జెట్(Budget) పై చర్చ జరుగుతోంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) సభలో ప్రసంగిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్(BRS) పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత పదేళ్ళ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకుండా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశారని ఆరోపించారు. పదేళ్ళ పాటు కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టక పోవడం వలన ఇటు నిరుద్యోగులు, అటు మ్యాన్ పవర్ లేక సంబంధిత విభాగాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటికీ నిధులు మాత్రం ఖర్చు చేయలేదని అన్నారు.
అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ. 2.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారని ఆరోపించారు. ఈ విషయాలు స్వయంగా కాగ్(CAG) బయట పెట్టిందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు చేశారని మండిపడ్డారు. పదేళ్ళ కాలంలో రూ.16.70 లక్షల కోట్లతో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ అమ్ముకున్నారని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.