కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు : కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-15 12:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి 8 మంది నాయకులను తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే, దేశ్ కి నేత అని అబద్దాలు చెప్పుకునే నరేంద్ర మోడీ మాత్రం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఏదైనా చేస్తారని నమ్మి అంతమందిని పార్లమెంటుకు ఎన్నుకుంటే.. ఇపుడు ప్రజల నమ్మకాన్ని గోదాట్లో కలిపారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఒక్క సీటు కాదు కదా.. కనీసం డిపాజిట్ కూడా కొంతమందికి దక్కలేదని అన్నారు. ప్రజలకు ఎవరు కావాలో తెలుసునని.. తెలంగాణలో ఇందిరమ్మ పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, అందుకే మాకు భారీ మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బద్దలు కొట్టి, బీజేపీ పార్టీని బొంద పెట్టడం సమస్య కాదని, దానికి తెలంగాణ ప్రజలు మాకు తోడు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ ఎక్కడికైనా ఏ సెంటర్ అయినా వస్తారని.. బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా చర్చకు వస్తారో రండి అని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. పదేళ్ళ బీఆర్ఎస్ పాలననో ఎనిమిది నెలల ఇందిరమ్మ రాజ్యం గొప్పదో ప్రజలే తేలుస్తారని అన్నారు. 


Similar News