GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాయలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది.

Update: 2024-09-23 13:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాయలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే జీహెచ్‌ఎంసీ పరిధిలో 164 ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులకు కమిషనర్ ఆమ్రపాలి(Amrapali) కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి విజ్ఙప్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం నగరంలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో అల్లాడిపోయిన హైదరాబాద్ నగరవాసులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీగా వర్షం కురిస్తోంది. దీంతో రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, డీఆర్​ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తున్నారు.


Similar News