Revanth Reddy: సర్పంచ్ ల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక దిశానిర్దేశం
సర్పంచ్ ఎన్నికలపై సీఎం కీలక దిశానిర్దేశం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశంలో (CLP Meeting) పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేన స్పష్టం చేశారు. గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని, సీసీరోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు, నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గెలుపే లక్ష్యంగా పార్టీలో కొత్త, పాత నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.