పెద్దన్నగా అండగా ఉంటా : సీఎం రేవంత్ రెడ్డి

నిరుద్యోగులకు పెద్దన్నగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Update: 2024-08-15 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు పెద్దన్నగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా వందన కార్యక్రమం అనంతరం ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలు విని జీవితాలు చెడగొట్టుకోవద్దన్నారు. ఎవరి రాజకీయ ఉద్యోగాల కోసమో మీ భవిష్యత్తు బలి చేసుకోవద్దు అని సూచించారు. ఇప్పటికే గడిచిన పదేళ్లుగా మీరు చాలా నష్ట పోయారన్నారు. మీకు పెద్దన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత నాది అన్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఇది నా హామీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ప్రతి ఏడూ ప్రకటిస్తూనే ఉంటామని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఇక రోడ్డు మీదికి రావాల్సిన అవసరం లేదు అన్నారు. యువత దృష్టి కేవలం చదువు మీద ఉంచాలని సూచించారు. టీజీపీఎస్సీని సంపూర్ణ ప్రక్షాళన చేస్తున్నామని, ఎక్కడా అవినీతి గాని, నిర్లక్ష్యం ఇక ఉండబోదని సీఎం అన్నారు.   


Similar News