విఠల్‌ రుక్మిణీ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది.

Update: 2023-06-27 07:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ రెండో రోజు పర్యటన కొనసాగుతున్నది. మంగళవారం ఉదయాన్నే సోలాపూర్‌ నుంచి పండరీపూర్‌ చేరుకున్నారు. పండరీపూర్‌లోని శ్రీ విఠల్‌ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించారు.

అక్కడి నుంచి సర్కోలిలోని ప్రముఖ నేత భగీరథ పాల్కే నివాసానికి కేసీఆర్ వెళ్లారు. అనంతరం గ్రామంలోని కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పాల్కేతో పాటు పలువురు చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంట‌ల‌కు శ‌క్తిపీఠం తుల్జాపూర్ భ‌వానీ ఆల‌యానికి వెళ్లి అమ్మవారిని ద‌ర్శించుకోనున్నారు. పూజల అనంతరం తిరిగి హైదరాబాదులోని ప్రగతి భవన్ కు చేరుకోనున్నారు. పూజా కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లతో పాటు మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Read More..

Rythu Bandhu scheme : ‘రైతుబంధు’తో తెలంగాణలో సాగు విప్లవం: మంత్రి  

Tags:    

Similar News