బ్రేకింగ్: రైతులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణ మాఫీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Update: 2023-08-02 13:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతు రుణ మాఫీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రేపటి (ఆగస్ట్ 3) నుండి రైతు రుణ మాఫీ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగించామని తెలిపారు. కరోనా వేళ కేంద్రం నిధుల్లో కోత విధించిందని.. కేంద్రం కక్షపూరిత వైఖరితోనే రైతులకు రుణ మాఫీ అమలులో జాప్యం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన రైతు సంక్షేమాన్ని విస్మరించే ప్రసక్తే లేదని అన్నారు. మరో రూ. 19 వేల కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉందని.. సెప్టెంబర్ రెండోవారంలోగా రైతు రుణ మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News