BJP ఒక్కటి అంటే.. మనం పది అనాలి: సీఎం KCR కీలక వ్యాఖ్యలు

బీజేపీ మరింత రెచ్చిపోతుందని.. ఇక ఆ పార్టీ యుద్ధమే అని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-11-15 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మరింత రెచ్చిపోతుందని.. ఇక ఆ పార్టీ యుద్ధమే అని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు కీలక విషయాలు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఒక్కటి అంటే.. మనం పది అనాలని టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. బీజేపీ మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని.. ఆయన భయపడకుండా బీజేపీని ధీటుగా ఎదుర్కొవాలన్నారు. టీఆర్ఎస్ నేతలు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని.. అలాగే వివాదస్పద విషయాల్లో తలదూర్చవద్దని హెచ్చరించారు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు భయపడవాల్సిన అవసరం లేదని.. ఈడీ దాడులు చేస్తే తిరడబడండని పార్టీ నేతలకు సూచించారు. వచ్చేది ఎన్నికల ఏడాదని.. రానున్న 10 నెలలు చాలా కీలకమని చెప్పారు. ఇప్పటి నుండి ఎమ్మెల్యేలంతా ఫీల్డ్‌లోనే ఉండాలని ఆదేశించారు. 

Read more:

1.TRS LP భేటీ: A.P C.M YS Jagan Mohan Reddy పై కేసీఆర్ అనూహ్య వ్యాఖ్యలు


Similar News