కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా.. "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు"ను అధికారికంగా నిర్వహిస్తుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా.. "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు"ను అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గోని.. పలు అభివృద్ధి కార్యక్రమాల శుంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్ మెంట్ ఆఫీస్‌కు శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం - పాల్వంచ డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్, సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే వృక్ష పరిచయ క్షేత్రం ప్రారంభించారు. వైల్డ్ లైఫ్ సఫారీ, ఎఆర్ వి ఆర్ బిల్డింగ్‌లను కూడా వర్చువల్ గా ప్రారంభం చేశారు. అనంతరం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన వాహనాలను ప్రారంభించారు. కాగా ఈ క్యార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.