అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) రోజున ఆవిష్కరించారు.

Update: 2023-04-14 10:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో క‌లిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. విగ్రహావిష్కర‌ణ సంద‌ర్భంగా బౌద్ధ గురువులు ప్రత్యేక ప్రార్థన‌లు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు ప్రజాప్రతినిధులు వీక్షించారు.

కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చ‌ప్పట్లతో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు. అంబేద్కర్ విగ్రహా శిలా పల‌కాన్ని సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరించారు. అనంతరం బౌద్ధ గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ సురేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రులు కేటీఆర్ హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.


Read more:

అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్తో పూలజల్లు

Tags:    

Similar News