Central Team: 11న రాష్ట్రానికి కేంద్ర బృందం రాక

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

Update: 2024-09-10 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో పలు జిల్లాల్లో ఇండ్లు, పంట పొలాలు నీటి మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను చూసేందుకు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ టీమ్‌ను రాష్ట్రానికి పంపుతోంది. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన బృందం సెప్టెంబర్ 11న అంటే బుధవారం తెలంగాణలో పర్యటించనుంది. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటూ మిగతా ప్రాంతాల్లో ఆ టీమ్ పర్యటించనుంది. అందులో కల్నల్ కేపీ సింగ్‌తో పాటు ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉండనున్నారు.   


Similar News