'సెస్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ అపహస్యం చేసింది'

సెస్ఎ న్నికల్లో బీఆర్ఎస్ ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆవునూరి రమకాంతరావ్ పేర్కొన్నారు.

Update: 2022-12-28 09:38 GMT

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి రమకాంతరావ్ పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ రూరల్ డైరక్టర్ స్థానం బీజేపి బలపరిచిన అభ్యర్థి గెలుపు ప్రకటించాక.. రీకౌంటింగ్ పేరిట మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని ప్రకటించారన్నారు.

చందుర్తి సెస్ డైరక్టర్‌గా బీజేపి బలపరిచిన అభ్యర్తి అల్లాడి రమేశ్ 18 ఓట్లతో గెలిచినప్పటికి 2 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ కు తొత్తులుగా పని చేస్తున్నరన్నారు. కోర్టులను కూడా గౌరవించలేని పరిస్థితి నెలకొందన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బండి సంజయ్ గురించి మాట్లాడే ఆర్హత లేదన్నారు. నీ స్థాయికి బండి సంజయ్ అవసరం లేదని, ఇల్లంతకుంట బీజేపి నాయకులు సరపోతారన్నారు. 11 ఏళ్లుగా పదవి లేదని కాళ్లు, వెళ్లు పట్టుకోని బ్రతిమిలాడిన వ్యక్తి, సిరిసిల్ల సెస్‌లో కోట్ల రూపాయాలు కుంభకోణం చేశారన్న ఆరోపణలు ఉన్న వ్యక్తినే మంత్రి కేటీఆర్ మరోసారి చైర్మన్ చేశాడన్నారు.

అతనేమో ఓట్లు పడేదాక అయ్యా బాంచేన్ అని .. గెలిచాక.. చైర్మన్ అయ్యాక గంటలోనే తనకు వ్యతిరేఖం పని చేసిన వారిని, విమర్శలు చేసిన వారికి చుక్కలు చూపిస్తున్నారని విమర్శించారు. బౌతిక దాడులకు కూడా వెనకాడం అంటూ ప్రకటనలు చేయడం దేనికి సంకేతం అన్నారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ ఆహంకార పూరితమైన మాటలకు ఎవరు భయపడేది లేదన్నారు. సెస్‌లో గతంలో జరిగిన అవినీతిని బయటపెడతామన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సెస్‌లో జరిగిన అక్రమాలు బహిర్గతం చేస్తామన్నారు. సెక్షన్ 51న మీద జరిగిన కృష్ణయ్య విచారణకు అడ్డుకోవాలని ఎందుకు స్టే తెచ్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సెస్ చైర్మన్ నిజాయితి పరుడైతే.. నీ మీద నీవే ఎంక్వైరి వేసుకోని విచారణ చేయించుకోవాలన్నారు. సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్ పదవి పద్మశాలీయులకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కానీ కొంత పద్మశాలీ నాయకులు కుల సంఘం పేరు మీద పదవులు పొంది.. మిగతా వారికి పదవులు రాకుండా చేస్తున్నారన్నారు. సిరిసిల్ల లో ఓ ఐదుగురు పద్మశాలీ నాయకులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తూ మిగతా పద్మశాలీ నాయకులను రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ తీరును ప్రజలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు వేణు, బర్కం నవీన్ యాదవ్, కైలాస్సింగ్, రాజ్సింగ్, దామోధర్, ప్రతాప్, తదిరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News