సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల కేసు

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.

Update: 2024-08-20 16:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ బీఆర్ఎస్ నేతలు మంగళవారం రేవంత్ రెడ్డిపై ఈ ఫిర్యాదు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు ఇవి కాదని, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్పందించాలని కోరారు. కాగా ఆగస్ట్ 20న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు అనే వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో చనిపోయాక కేసీఆర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ అనుకుంటున్నాడని, ఆయన పోయేది ఎపుడు.. పెట్టేది ఎపుడు అన్నారు. వేలాది కోట్లు దోచుకున్న కేసీఆర్ విగ్రహం పెట్టి విద్యార్థులకు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు లాంటి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, ముఠా గోపాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్ మాటలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.   


Similar News