MJPTBCWREIS Admissions: బీసీ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే(Mahatma jyotiba phule) వెనుకబడిన తరగతుల సంక్షేమ(BC Welfare) వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల(Agriculture Women's Degree College)లో అడ్మిషన్ల(Admissions) కోసం దరఖాస్తుల ప్రక్రియ(Applications Process) రేపటి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2024-09-22 18:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే(Mahatma jyotiba phule) వెనుకబడిన తరగతుల సంక్షేమ(BC Welfare) వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల(Agriculture Women's Degree College)లో అడ్మిషన్ల(Admissions) కోసం దరఖాస్తుల ప్రక్రియ(Applications Process) రేపటి నుంచి ప్రారంభం కానుంది. బీఎస్సీ మొదటి సంవత్సరం(BSC First Year)లో ప్రవేశం(Admittance) కోసం అగ్రిసెట్(AGRICET)లో అర్హత సాధించిన వారు ఈ నెల 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థినిలను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయ పనివేళల్లో 040-23328266 నంబర్‌కు కాల్‌ చేసి సంప్రదించాలని ఆయన కోరారు.


Similar News